గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే కీలకం – కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు. 

ఎన్టీఆర్ జిల్లా.ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) నందిగామ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం నందిగామలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలంటే ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు.గ్రామ కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే గ్రామ,మండల,జిల్లా మరియు...