prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 7:42 am Digital Edition : PRAJA VANI

గ్రామ బూత్ గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టే

గ్రామ బూత్ గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టే”

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్

ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి

డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి కాంగ్రెస్ నాయకుల పిలుపు

ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయించాలి

టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి యోగీశ్వర్ రెడ్డి

షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిఎల్ఎలకు ఓటర్ల జాబితా సవరణపై భారీ అవగాహన శిక్షణ శిబిరం

షాద్‌నగర్ ప్రజావాణి జూన్ 13 :
:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బిఎల్ఎలు) అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి యోగీశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షురాలు జ్యోత్స్న చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముకలాంటివారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాబోయే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని సూచించారు.
“బూత్‌లో గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టే” అంటూ శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, ప్రతి బూత్‌లో పార్టీ బలాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని, బూత్ స్థాయిలో విజయం సాధిస్తే రాష్ట్ర స్థాయిలో విజయం సాధించినట్టేనని అన్నారు. యువత, మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు బిఎల్ఎలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రతిపాదిత తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించి, ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా తొలగించబడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో అందజేసిన బిఎల్ఎ హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా అధ్యయనం చేసి, చట్టపరమైన నిబంధనలు, ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలను అవగాహన చేసుకోవాలని కోరారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతోందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని నాయకులు సూచించారు. బూత్ స్థాయిలో ఓట్లను కాపాడుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడినట్లేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫరూక్‌నగర్ మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, చౌదరిగూడ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కొత్తూరు మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, నల్లమోని శ్రీధర్, నందిగామ మండల అధ్యక్షుడు కుమార్ గౌడ్, కొందుర్గు మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, కేశంపేట మండల అధ్యక్షుడు రమేష్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వరప్ప, బాలరాజ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బిఎల్ఎలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..