గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం
ఘనంగా విస్డంహైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు చిగురుమామిడి (మన ప్రజావాణి ప్రతినిధి): పాఠశాలలో నిర్వహించే గ్రాడ్యుయేషన్ డే వేడుకలు చిన్నారి విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంచడమే కాకుండా, వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తాయని బొమ్మనపల్లి విస్డం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ కంది సంధ్య, ప్రిన్సిపాల్ మోర సత్యనారాయణ తెలిపారు. శనివారం మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని విస్డం హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, కేజీ తరగతుల విద్యార్థులకు చిన్నారుల తొలి విద్యా మైలురాయిని...