prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 8:33 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులను తక్షణమే తొలగించాలి. సిపిఐ డిమాండ్.

నరసరావుపేట మే 17 ప్రజావాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్న ,పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని నేటికీ సక్రమంగా అమలు చేయడం లేదని పల్నాడు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు వారం రోజుల వ్యవధిలో బెల్టు షాపులు తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.కండ్రిక స్ఫూర్తి అన్ని గ్రామీణ ప్రాంతాల రావాలి. మహిళా, విద్యార్థి యువజన గిరిజన సంఘాల నాయకులు. . సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్ కు నాయకులు వింత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో బెల్టు షాపులు తీయకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని తెలిపారు. నరసరావుపేట మహిళా సమాఖ్య కార్యదర్శి యస్. దేవి, అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణము 8అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా వెలుస్తున్న బెల్ట్ షాపుల వలన పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలు చిన్న బిన్నం అవుతున్నాయని, గిరిజన తండాల్లో బెల్టు షాపులు ఎక్కువగా ఉన్నాయని బొల్లాపల్లి, వెల్దుర్తి ఈపూరు లాంటి మండలాల్లోనే కాకుండా మరికొన్ని గిరిజన గ్రామాల్లో యదేచ్చగా బెల్టు షాపులు నడుస్తున్నాయనీ తక్షణమే అధికారులు తొలగించాలన్నారు.బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఆటోను స్థానిక మహిళలు, గ్రామస్తులు ప్రాణాలకు తెగించి అడ్డుకొని, నిరసన తెలపడమే కాకుండా, ఆటోలోని మద్యం సీసాలను రోడ్డుపై పడవేసి ధ్వంసం చేయడం ద్వారా తమ నిరసన సెగను ప్రభుత్వానికి చూపించారు. కండ్రిక మహిళల పోరాట స్ఫూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఇలాంటి తెగువా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో రావాలని పిలువు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు రంగయ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పల్నాడు జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, దుగ్గి బ్రహ్మయ్య, సూరి,కోయ శ్రీను తదితరులు పాల్గొన్నారు