గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
బిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పేరుతో దోచుకున్నారు
ఎమ్మెల్యే రేవూరి
నడికూడ,జూన్ 19(ప్రజా వాణి ): ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఇప్పుడు కుట్టు మిషన్ల పంపిణీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నడికూడ మండలంలోని పలు గ్రామాలలో ఎం జిఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
*ధర్మారం* గ్రామపంచాయతీ కార్యాలయం ముందుధర్మారం,రామకృష్ణాపురం, కంటాత్మకూర్, సర్వాపురం, కౌకొండ గ్రామాలలో ఎం జిఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంతకుముందు డీజే, కోలాటాలు,డప్పు చప్పుళ్ళతో ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికారు.
*నడికూడ* మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో నడికుడ, నరసక్కపల్లి, రాయపర్తి, పులిగిల్ల, వరికోల్ గ్రామాలలో ఎం జి ఎం ఆర్ జి ఎస్ నిధులతో చేపట్టిన సిసి రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అనంతరం వన మహోత్సవం లో భాగంగా మొక్కలను నాటారు.
*చౌటుపర్తి* గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు చౌటుపర్తి, వేంకటేశ్వర్లపల్లి, నార్లపూర్, చర్లపల్లి, ముస్త్యాలపల్లి గ్రామాలలో ఎం జి ఎం ఆర్ జి ఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లకు చౌటుపర్తి గ్రామంలో నిర్మించనున్న మహిళా సమైక్య భవనమునకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ…గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు, కాంట్రాక్టర్లను చూసి అభివృద్ధి పనులు చేపట్టారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.గ్రామాలలోని ప్రతి వార్డులోను ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు.బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రజా ధనాన్ని దోచుకొని పాపలు పోవడానికి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నారని అన్నారు.మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కాంట్రాక్టర్ ముసుగులో దోచుకుతున్నాడని తెలిపారు. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మండ్లను పంపిణీ చేస్తున్నమన్నారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూ గ్యాస్ సిలిండర్,2 లక్షల లోపు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్న వడ్లకు 500 రూ బోనస్, గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తదితర సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు.
