గ్రామాలు సుభిక్షంగా ఉండాలంటే బొడ్రాయి సాంప్రదాయాన్ని కొనసాగించాలి* *ఆదర్శ దంపతులు చిట్యాల కొమురయ్య , కొమురవ్వ
బెజ్జంకి -కోహెడ మే 3(ప్రజావాణి ) సిద్దిపేట కోహెడ మండలం కూరెళ్ళ గ్రామంలో గ్రామస్తులు రెండు రోజుల బొడ్రాయి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మొదటి రోజు శనివారం గ్రామ ఆడపడుచులు గంగా జలాన్ని తీసుకెళ్లి " శ్రీదేవి- భూదేవి"( బొడ్రాయి బండలపై ) లకి జలాభిషేకం చేశారు. రెండవ రోజు ఆదివారం డప్పు చప్పుళ్లతో, శివసత్తుల పూనకాలతో , చిన్నారుల కేరింతల నడుమ, ఆడపడుచుల కోలాటాలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులకు ఒడి బియ్యం పోసి , సారీ...