గ్రామానికి రూ.18 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరు-హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ హర్షం

ఎమ్మెల్యే డా. కవంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ బెజ్జంకి, జూన్ 30 (ప్రజావాణి)   మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామానికి రూ.18 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ నిధులు మంజూరయ్యాయి. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడెం గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక కృషి...