టేక్మాల్ జూలై 27 : మన ప్రజావాణి గ్రామపంచాయతీ నిధులను ఇష్ట రాజ్యాంగ విత్ డ్రా లు చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు మెంబర్లు ప్రజలు ఎంపీడీవో సత్యనారాయణకు ఫిర్యాదు అందజేశారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామ సర్పంచ్ తలారి అవినాష్ కుమార్ గ్రామపంచాయతీలో పనులు అంతంత మాత్రం జరుగుతున్న నిధులు మాత్రం ఆరు నెలల్లో దాదాపుగా 11 లక్షల రూపాయలు విత్ డ్రా చేసిన విధానానికి గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.గత కొన్ని రోజుల క్రితం ఒక వార్డ్ మెంబర్ పంచాయతీ లెక్కలు చెప్పమని కోరగా నువ్వెంత నీ స్థాయి ఎంత ఆఫ్ట్రాల్ వార్డు మెంబర్ నువ్వు నాకే లెక్కలు అడిగే స్థాయానిది అని దురుసుగా మాట్లాడారు. ఇలా అడ్డగోలుగా నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు ,నాయకులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో గ్రామ వార్డుమెంబర్లు కంకర భూషణం, గడ్డం గోపాల్, మహమ్మద్ కరీం గ్రామస్తులు కొటంగారి శంకరయ్య, తంపులూరి నర్సింలు, డప్పు పెంటయ్య ఉన్నారు.