గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే సమ్మె చేపడుతాం..సిపిఐ
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) పోరుమామిళ్ల సంవత్సరాలు గడిచిన జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు గడిచేదెలా,సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ అధికారులపై ఆగ్రహం.పోరుమామిళ్ల గ్రామపంచాయతీ కార్మికులకు సంవత్సరం పైబడి జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా బతకాలి అని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు సఫా,పంచాయతీ నాయకులు నాగేష్ వారి బృందంతో గురువారం పంచాయతీ సెక్రటరీ.కి వినతి పత్రం అందించి 30 వ తేదీలోపు వేతనాలు ఇవ్వకపోతే సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఈవో శ్రీనివాసులు,మండల అభివృద్ధి అధికారులకు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా...