కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) పోరుమామిళ్ల సంవత్సరాలు గడిచిన జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు గడిచేదెలా,సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ అధికారులపై ఆగ్రహం.పోరుమామిళ్ల గ్రామపంచాయతీ కార్మికులకు సంవత్సరం పైబడి జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా బతకాలి అని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు సఫా,పంచాయతీ నాయకులు నాగేష్ వారి బృందంతో గురువారం పంచాయతీ సెక్రటరీ.కి వినతి పత్రం అందించి 30 వ తేదీలోపు వేతనాలు ఇవ్వకపోతే సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఈవో శ్రీనివాసులు,మండల అభివృద్ధి అధికారులకు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఏఐటీయూసీ నాయకులు పోరుమామిళ్ల పట్టణాన్ని శుభ్రం చేయాలంటే గ్రామపంచాయతీ కార్మికులు అవసరం అలాంటి పంచాయతీ కార్మికులకు 9 నెలలు,ఎలక్ట్రిషన్ సిబ్బందికి 13 నెలలు,వాటర్ సిబ్బందికి 15 నెలలు,స్వచ్ఛభారత్ కార్మికులకు 14 నెలలు వేతనాలు ఇవ్వకపోతే ఏ విధంగా కుటుంబాలు గడవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారని వారు అన్నారు ఈరోజు అధికారులకు,రాజకీయ నాయకులకు,నీటి సమస్య, లైటింగ్,డ్రైనేజీ కాలువలు పూడిక తీయడం,పంది,కుక్క,బర్రె,అనాధ శవాలు ఎవరు చనిపోయిన పంచాయతీ కార్మికుల అవసరం,ఆగమేఘాల మీద ఇప్పుడే శుభ్రం చేయాలని అధికారులు ఆర్డర్ చేసినప్పుడు,వారికి జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు అధికారులు చేస్తున్నారు అర్థం కావడం లేదు. అలాగే కార్మికులు వయస్సు అయిపోయిన తర్వాత కుటుంబానికి ఆసరాగా ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి,చివరకు మనిషి చనిపోయిన అంత్యక్రియలు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం,అందుకోసమై కార్మికులకు పీఎఫ్,ఈఎస్ఐ చట్టభద్రత కల్పించాలని,నాలుగు సంవత్సరాలయిన బ్లౌజులు,డ్రెస్సులు ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం ఈ సమస్యలన్నిటి పైన 29 తేదీ లోపు పరిష్కరించకపోతే,30వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తామని అధికారులకు తెలియజేయడమైనది,ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క నెల వేతనం ఇవ్వకపోతే బ్యాంకుల చుట్టూ,ఫోన్ చేత పట్టుకొని ప్రదక్షణ చేసే పరిస్థితి అలాంటిది పట్టణాన్ని శుభ్రం చేసే కార్మికులకు వేదనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం తగదని అధికారులకు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు పిరయ్య, పంచాయతీ కార్మికులు ఓబులమ్మ,శారద గుర్రప్ప,ఆంథోనీ,నాగార్జున,రమణ,శ్రీరాములు,వెంకటేష్,కరీముల్లా,నాగార్జున,రాయలమ్మ,నాగేంద్ర కాసిం పీరా, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు