గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి భూమి చదును
గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి అడుగులు భూమి చదును కార్యక్రమం పూర్తి జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 16 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధల నడుమ నూతన శివాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో భూమి చదును (Land Leveling) కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ పుణ్యకార్యానికి భూమిని విరాళంగా అందజేసిన భూదాత ఏలేటి చంద్రా రెడ్డి గారిని ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు....