prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 9:05 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి భూమి చదును

గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి అడుగులు

భూమి చదును కార్యక్రమం పూర్తి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 16 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధల నడుమ నూతన శివాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో భూమి చదును (Land Leveling) కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ పుణ్యకార్యానికి భూమిని విరాళంగా అందజేసిన భూదాత ఏలేటి చంద్రా రెడ్డి గారిని ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు. ఆలయ నిర్మాణం వల్ల గ్రామానికి ఆధ్యాత్మిక శోభ చేకూరుతుందని వారు ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ మేరుగు జానీ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు సమక్షంలో శివనామ స్మరణతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అతి త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.