గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్లక్ష్యం..
రోడ్లపై కారుతున్న వేస్ట్ డస్ట్‌తో వాహనదారులకు నరకయాతన.. అరెంపుల,కొండాపురం మధ్య ప్రయాణం ప్రమాదకరం. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న ప్రజలు.. పాలేరు(ఖమ్మం రూరల్), ప్రజావాణి, మే 22.. ఖమ్మం రూరల్ మండలంలోని అరెంపుల, కొండాపురం గ్రామాల మధ్య ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న గ్రానైట్ వేస్ట్ డస్ట్‌ను లారీలలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా లోడింగ్ చేసి తరలించడం వల్ల రోడ్లన్నీ ధూళితో నిండిపోతున్నాయి. లారీలపై సరైన కవర్లు లేకుండా భారీగా...