prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 11:27 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గ్యాస్ ధరలు పెంచి వంటింట్లో మంటలు పెట్టిన మోడీ-చంద్రబాబు.ప్రొద్దుటూరు కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

ప్రజావాణి న్యూస్:(మార్చి-08)ప్రొద్దుటూరు :ఆంధ్రాలో కూటమి సర్కారా లేకుంటే ట్రంప్ సర్కారా?? ఒకప్పుడు నోట్ల రద్దు చేసి ఏటీ.ఎం ల ముందు క్యూలు ఇప్పుడు గ్యాస్ కోసం క్యూలా ఇదేనా మంచి ప్రభుత్వం అని నరేంద్ర మోడీ మరియు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రొద్దుటూరు కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా మహిళా దినోత్సవం సందర్బంగా గ్యాస్ ధరల పెంపు మహిళలపై అన్యాయం  గృహ వినియోగ గ్యాస్‌పై రూ.60, కామర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంపు  గ్యాస్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలపై మరింత భారం ⁠గ్యాస్ ఎంత వాడాలో ప్రభుత్వమే నిర్ణయించడం దుర్మార్గం రంజాన్, ఉగాది, శ్రీ రామనవమి, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వంటి పండుగల సమయంలో గ్యాస్‌పై ఆంక్షలు విధించడం ప్రభుత్వం ప్రజల అవసరాలను అర్థం చేసుకోలేకపోతున్నదానికి నిదర్శనం ⁠అమెరికా ఒత్తిడికి లోబడి విదేశాంగ విధానం నడిపితే భారత ప్రజలే ధరలు పెరిగి నష్టపోతారు అని విమర్శ ఈ రోజు గ్యాస్ ధరలు పెంచిన సందర్భంగా ప్రొద్దుటూరులో కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఇర్ఫాన్ బాషా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 పెంచడం, అలాగే కామర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడం సాధారణ ప్రజలపై మరింత భారాన్ని మోపే చర్య అని ఆయన అన్నారు.మహిళా దినోత్సవం రోజున మహిళలకు సంక్షేమ పథకాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశించిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన రూ.1500 ఆర్థిక సహాయం వాగ్దానం అమలు చేయకుండా, గ్యాస్ ధరలను పెంచడం దురదృష్టకరం అని విమర్శించారు.గ్యాస్ ధరల పెంపు వల్ల గృహిణులపై మాత్రమే కాకుండా, హోటళ్లు, చిన్న వ్యాపారాలు మరియు ఇతర వాణిజ్య రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దీనివల్ల మార్కెట్‌లోని ఇతర అవసరమైన వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.గ్యాస్ ధరలు పెరిగినా కూడా సిలిండర్ కోసం ప్రజలు 25 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించినా 25 రోజుల ముందు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలు ఎంత గ్యాస్ వాడాలో కూడా పరోక్షంగా నియంత్రిస్తున్నదా అనే సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రంజాన్, ఉగాది, శ్రీ రామనవమి, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వంటి పండుగల సమయంలో గ్యాస్ కొరత ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ధరల పెంపుతో పాటు గ్యాస్ సరఫరాలో ఆలస్యం కూడా ప్రజలపై ద్వంద్వ భారం మోపుతోందని విమర్శించారు.అంతేకాకుండా, దేశ విదేశాంగ విధానంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అంతర్జాతీయంగా భారత్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందనే అనుమానం వ్యక్తం చేశారు.గతంలో మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్, అటల్ బిహారి వాజపేయి భారతదేశం ఒక సార్వభౌమ దేశం అని ప్రపంచానికి స్పష్టంగా తెలిపారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రభావాలకు లోనవుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముఖ్య నాయకుల్లో ఒకరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఇతర మిత్రపక్ష నాయకులు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇరాన్‌తో ఉన్న సంబంధాలు దెబ్బతినడం, అంతర్జాతీయ పరిస్థితులు మారడం వంటి కారణాల వల్ల ఇంధన సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలపై భారం వేయడం సరైన చర్య కాదని అన్నారు.గ్యాస్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ ధరల పెంపును కాంగ్రేస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు.