గోమాత.. కానీ నేడు, ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి
కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) ప్రొద్దుటూరు సాక్షిగా.సకలదేవతా స్వరూపిణి.సకల పురాణాల వేదిక.మన హిందూ సంస్కృతికి మూలస్తంభం.గోమాత.కానీ నేడు,ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.2026 వేసవి భగభగలాడుతోంది.ఎండలు మండిపోతుంటే మనుషులమైన మనమే ఏసీలు,కూలర్ల చాటున దాక్కుంటున్నాం.మరి అనాథలై రోడ్ల మీద అల్లాడుతున్న ఆ గోమాతల సంగతేంటి.ప్రొద్దుటూరు వీధుల్లో దయనీయ దృశ్యం ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్నారని మొక్కుతాం.గోపూజలు చేస్తాం.కానీ అదే ఆవు ఆకలితో అలమటిస్తుంటే,గొంతు ఎండిపోయి నీటి కోసం విలవిలలాడుతుంటే ఎటు వెళ్ళాయి మన భక్తి భావాలు.తిండి...