prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 11:22 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గోమాత.. కానీ నేడు, ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి

కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) ప్రొద్దుటూరు సాక్షిగా.సకలదేవతా స్వరూపిణి.సకల పురాణాల వేదిక.మన హిందూ సంస్కృతికి మూలస్తంభం.గోమాత.కానీ నేడు,ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.2026 వేసవి భగభగలాడుతోంది.ఎండలు మండిపోతుంటే మనుషులమైన మనమే ఏసీలు,కూలర్ల చాటున దాక్కుంటున్నాం.మరి అనాథలై రోడ్ల మీద అల్లాడుతున్న ఆ గోమాతల సంగతేంటి.ప్రొద్దుటూరు వీధుల్లో దయనీయ దృశ్యం ​ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్నారని మొక్కుతాం.గోపూజలు చేస్తాం.కానీ అదే ఆవు ఆకలితో అలమటిస్తుంటే,గొంతు ఎండిపోయి నీటి కోసం విలవిలలాడుతుంటే ఎటు వెళ్ళాయి మన భక్తి భావాలు.తిండి లేకపోయినా కొన్ని రోజులు తట్టుకుంటుందేమో కానీ,ఈ భానుడి భగభగలకు గుక్కెడు నీరు లేక ఆ తల్లి కళ్ళలో కనిపిస్తున్న ఆవేదన మనకు శాపం కాదా.భక్తి పేరుతో దోపిడీ ఇది ధర్మమా.ఇక్కడ మరో దారుణం ఏమిటంటే.కొందరు కేటుగాళ్లు.గోసేవ.అంటూ గూగుల్ పే నంబర్లు పట్టుకుని వసూళ్లకు దిగుతున్నారు.మీ పొట్టలు నింపుకోవడానికి ఆ గోమాత పేరును వాడుకోవడం ఎంతవరకు ధర్మం.వసూలు చేసిన సొమ్ములో కనీసం కొంతైనా ఆ మూగజీవాల దాహం తీర్చడానికి వాడుతున్నారా.భక్తిని వ్యాపారం చేసే మీకు ఆ గోమాత ఉసురు తగలక మానదు.ధర్మో రక్షతి రక్షితః.నువ్వు ధర్మాన్ని కాపాడితే.ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది.​హిందూ సోదరులకు ఒకే విన్నపం హిందువులమని గర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.మీ ఇంటి ముందు ఆవు కనిపిస్తే అది దాహంతో ఉందేమో గమనించండి..వీలైతే మీ ఇంటి బయట ఒక నీటి తొట్టిని ఏర్పాటు చేయండి.నకిలీ.గోసేవకుల.మాటలు నమ్మి మోసపోకండి,మీరే స్వయంగా సేవ చేయండి.ప్రొద్దుటూరు పుణ్యభూమిలో ఆ తల్లి ఆకలి కేకలు వినబడకూడదు.గోమాత దాహాన్ని తీర్చడం అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడిని సేవించడమే.ధర్మాన్ని కాపాడండి, గోమాతను రక్షించుకోండి.