గోపాల్పూర్‌లో ఘనంగా 1987–88 పదో తరగతి విద్యార్థుల ఫ్రెండ్షిప్ డే వేడుకలు

గోపాల్పూర్‌లో ఘనంగా 1987–88 పదో తరగతి విద్యార్థుల ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ గ్రామంలో 1987–88 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆత్మీయంగా సమావేశమై వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొత్తం 86 మంది విద్యార్థులు ఒకేచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 39 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న ఈ స్నేహితులు నేటికీ...