prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 11:57 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గోపవరం మండలంలో “మండల పరిషత్” సర్వ సభ్య సమావేశం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) గోపవరం మండలంలో “మండల పరిషత్” సర్వ సభ్య సమావేశం ఎంపీడీవో  కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మీ, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యంగా వేసవికాలంలో తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది.”జలధార- జల హారతి‘ కార్యక్రమం గురించి మండల స్థాయి అధికారులకు మరియు  ఎంపీటీసీ  లకు అవగాహన కల్పించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు వారి శాఖ తరపున ప్రగతి నివేదికలు మరియు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.ఈ సమావేశంలో గోపవరం  జడ్పిటిసి  సభ్యులు జయ రామి రెడ్డి ,వి.శ్రీధర్,మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొనడం జరిగింది.