గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేక గ్రామసభ

గోపవరం జూన్ 5 ప్రజావాణి  గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక గ్రామసభను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్/ఎంపీడీఓ వి. శ్రీధర్, డెప్యూటీ ఎంపీడీఓ హసీనా, మరియు పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (PDO) ఎస్. విజయ్ కుమార్ ల సంయుక్త పర్యవేక్షణలో జరిగింది.ఈ ప్రత్యేక గ్రామసభలో ముఖ్యంగా క్రింది అంశాలపై విస్తృతంగా చర్చించి, పలు తీర్మానాలు చేశారు:1. పర్యావరణ సంరక్షణ: ప్రకృతిని కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని, నాటిన ప్రతి మొక్కను...