గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జైపూర్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ జైపూర్,జూలై 31,ప్రజావాణి: కడెం ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, గురువారం సాయంత్రం 7.30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని జైపూర్ ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా చేపలు పట్టేందుకు...