గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

అధికారులు ముందస్తు చర్యలతో సన్నద్ధంగా ఉండాలి. :: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి ) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద నీటితో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేట, ఈత వంటి కార్యకలాపాల కోసం నదులు, వాగులు,...