prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 4:36 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

గోడిశెలపేటలో ఉచిత వైద్య శిబిరం

గోడిశెలపేటలో ఉచిత వైద్య శిబిరం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 13 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గోడిశెలపేట గ్రామంలో శుక్రవారం రోజున పద్మపాణి సోసైటీ కరీంనగర్ వారి ఆద్వర్యంలో స్థానిక సర్పంచ్ కందికట్ల అమృత రాజేషం సమక్షంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ అమృత రాజేషం తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకున్నారు. గ్రామంలో సుమారు 100 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, తగిన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్, గ్రామ ఎం ఎల్ హెచ్ పి గణేష్, సూపర్వైజర్ మనోరమ, ఏఎన్ఎం వినోదాదేవి, పంచాయతీ కార్యదర్శి ఎం డి హఫీజ్, ఉపాధి హామీ సహాయకులు గజ్జెల రాజేష్ ఆశా కార్యకర్తలు సరళ మమత పద్మ పాణి సూపర్వైజర్ నక్క సుదర్శన్, లింక్ వర్కర్ జి పద్మ తదితరులు పాల్గొన్నారు.