prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 2:25 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

గోడిశెలపేటలో ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్ – డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్

గోడిశెలపేటలో ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్ – డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్, ఫిబ్రవరి 26 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్‌లో భాగంగా గురువారం గోడిశెలపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎస్సై పులిచర్ల ఉదయ్ కుమార్ పాల్గొని గ్రామస్తులకు, వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని కోరారు. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:

రక్షణ కవచం: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.

మద్యం సేవించి వాహనం నడపరాదు: ప్రాణాపాయానికి ప్రధాన కారణమైన డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలి.

వేగ నియంత్రణ: నిర్ణీత వేగ పరిమితిని పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని సూచించారు.

సీటు బెల్ట్ & మొబైల్ వాడకం: కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు.

కేవలం మన జాగ్రత్త మాత్రమే కాదు, ఎదుటి వాహనదారుల కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా వాహనం నడపడమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అని దీనివల్ల ఊహించని ప్రమాదాల నుండి బయటపడవచ్చునని, రోడ్డుపై ఇతర వాహనదారులను గౌరవిస్తూ, బాధ్యతాయుతంగా ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందికట్ల అమృత రాజేశం, పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.