గొడిశలపేట రైతు వేదికలో సీడ్ మేళా ప్రారంభం
గొడిశలపేట రైతు వేదికలో మూడు రోజుల పాటు నిర్వహించే సీడ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు కందులు, పెసర్లు, కూరగాయల నాణ్యమైన విత్తనాలను విక్రయానికి ఉంచారు. ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగుపై అధికారుల సలహాలు అందించారు. MAO మహేష్, AEOలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్న ఈ మేళాలో ధృవీకరించిన విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.