గొడిశలపేటలో పిచ్చికుక్క స్వైరవిహారం, ఏడుగురికి గాయాలు

ఎండపల్లి మండలం గొడిశలపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈరోజు ఒక పిచ్చికుక్క తీవ్ర అలజడి సృష్టించింది. వీధుల్లో స్వైరవిహారం చేస్తూ ఒక్కసారిగా దాడికి దిగి, ఏడుగురు స్థానికులను తీవ్రంగా కరిచింది. గాయపడిన బాధితులను గ్రామస్థులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది..