గొంటువారిపల్లె గ్రామంలో బోడె రామచంద్ర యాదవ్ సమక్షంలో బిసివై పార్టీలో భారీ చేరికలు

ప్రజావాణి న్యూస్ :(మార్చి08) బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె గ్రామంలో రేగులగడ్డ వారి కుటుంబంలో నిర్వహించిన కేశ ఖండన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసివై పార్టీ అధ్యక్షులు  బోడె రామచంద్ర యాదవ్   ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ముందుగా ఆయన పోరుమామిళ్ల పట్టణానికి చేరుకుని డాక్టర్ .బి .ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నాయకులు, కార్యకర్తలతో కలిసి గొంటువారిపల్లె గ్రామానికి వెళ్లి...