గూడెం-బేగంపేట రహదారి ప్రయాణం నరకమే..
రోడ్డు మరమ్మత్తు చేయాలని రోడ్డుపై బైటాయింపు
బెజ్జంకి, ఏప్రిల్ 28(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం–బేగంపేట గ్రామాలను కలుపుతున్న రహదారి ప్రయాణం నరకంగా మారింది.రోడ్డుపై కంకర, గుంతలతో నిండిపోయిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.వర్షాల కారణంగా రహదారి మరింత దెబ్బతిని,వాహనదారులు,పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్,స్థానిక ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు సమస్యను పరిష్కరించాలని ప్రజలు, వాహన దారులు కోరారు. రోడ్డు సమస్యలను పట్టించుకోకపోతే తీవ్ర నిరసనలు చేపడతామని గ్రామస్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బేగంపేట మాజీ సర్పంచ్ పోతిరెడ్డి వెంకట్రెడ్డి, గూడెం మాజీ సర్పంచ్ మాంకాళి బాలయ్య, బి ఆర్ ఎస్ యువజన నాయకులు కొరివి తిరుపతి, జాఫర్, బుర్రా మల్లేశం, వాహనదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.