prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 1:54 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

గుల్లకోట రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా ప్రారంభం

ఎండపల్లి మండలంలోని గుల్లకోట రైతు వేదికలో మంగళవారం విత్తన మేళా వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు జరిగే ఈ ప్రదర్శనలో ప్రభుత్వం సూచించిన బీపీటీ, తెలంగాణ సోన వంటి వరి రకాలు, పప్పుధాన్యాలు, నానో ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గొల్లపెల్లి మల్లేష్ గౌడ్, పడిదం లావణ్య, ఏవో మహేష్, ఏఈఓ లావణ్య, ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.