prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 5:35 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

గుల్లకోట గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం

గుల్లకోట గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 06(ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ఈరోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో గ్రామ ప్రజలు, స్థానిక ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో, చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ అరిగేలా జయవ్వ రవి, వార్డు సభ్యులు రామగిరి రజిత, పాలకుర్తి తిరుపతి గౌడ్, చెన్నెళ్ళ వేణు, ఓరగంటి నగేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిసగోని సత్యం గౌడ్, గోనె సంతోష్ గౌడ్, మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.