ఈరోజు గుల్లకోట గ్రామంలో సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఈవో లావణ్య మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో వరి కాకుండా ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. వర్షభావం వల్ల నీటిని వృథా చేయవద్దని, తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నం రాజు, రైతులు పాల్గొన్నారు.