prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 3:02 pm Digital Edition : RAJASHEKARREDDY

గురు పౌర్ణమి సందర్భంగా దయానందగిరి స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు

 

బెజ్జంకి,జూలై 29 (ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ధ్యాననిష్టా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ దయానందగిరి స్వామి శ్వేత విగ్రహానికి పూజారి కాచం వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకం, ఫలాభిషేకం, పుష్పాభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో గురువును ఆరాధించారు.అనంతరం భగవద్గీత, విష్ణు సహస్రనామం, గురు అష్టోత్తర శతనామాలతో పారాయణం నిర్వహించి దేశ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో అరుకొంతం మల్లారెడ్డి, అన్నాడి రాంరెడ్డి, అన్నాడి ఆదిరెడ్డి, బద్దం భగవాన్ రెడ్డి, సురుకొంటి రాజిరెడ్డి, అన్నాడి తిరుపతిరెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, పులి శ్రీనివాస్, పులి లక్ష్మణ్, కట్టుకోజ్వల సదానందం, అంకం శివరాజం, విజయ తదితరులు పాల్గొన్నారు.