గురుపౌర్ణమి సందర్భంగా శివరెడ్డిగూడ సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – అన్నదాన సేవ
ఘట్‌కేసర్, జూలై 29: గురుపౌర్ణమి సందర్భంగా శివరెడ్డిగూడలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కొంతం రామ్‌రెడ్డి, అంజిరెడ్డి, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి, ఆధ్యాత్మిక వాతావరణంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎర్రసాని సుధాకర్ కుటుంబ సభ్యులు, రమేష్...