గురుకుల పాఠశాలలో పోలీసు కళాబృందం అవగాహన సదస్సు

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మార్చి 16 (ప్రజావాణి): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్గటూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ పులిచర్ల ఉదయ్ కుమార్ సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సామాజిక అంశాలపై అద్భుతమైన...