prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 11:22 am Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్ల చెరువులో ముదిరాజ్ కులస్తుల చేపల వేట

బెజ్జంకి, జూలై 19 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ పిల్లవాగులో ఆదివారం ముదిరాజ్ కులస్తులు సంప్రదాయ పద్ధతిలో చేపల వేట నిర్వహించారు. వలలు, ఇసురు వలల సహాయంతో చేపలు పట్టగా, గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించారు.
ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పిల్లవాగులో నీటి మట్టం తగ్గి చేపలు బాగా లభిస్తున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
పట్టిన చేపలను గ్రామస్తులకు విక్రయించడంతో పాటు కొంత భాగాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు ముదిరాజ్ సంఘ సభ్యులు పేర్కొన్నారు. చేపల వేట తమ సంప్రదాయ వృత్తి అని, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని వారు కోరారు.