prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 3:16 pm Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్ల గ్రామంలో హమాలీ కార్మికులకు భవనం మంజూరు చేయాలి- “ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన హమాలీలు”

బెజ్జంకి, జూలై 3 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు హమాలీ కార్మిక భవనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా హమాలీ కార్మికులు మాట్లాడుతూ భవన ఏర్పాటు ద్వారా కార్మికుల సమావేశాలు,సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని వివరించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సానుకూలంగా స్పందించి, హమాలీ కార్మిక భవనం మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.