గుగ్గిళ్ల గ్రామంలో భక్తి పారవశ్యంలో హనుమాన్ శోభాయాత్ర
బెజ్జంకి, మే 9 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని హనుమాన్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్రను శనివారం ఘనంగానిర్వహించారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవమూర్తిని వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో కోలాట నృత్యాలు చేస్తూ శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హనుమాన్ మాలదారులు, భక్తులు జై శ్రీరామ్,...