prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 4:22 pm Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్ల గ్రామంలో భక్తి పారవశ్యంలో హనుమాన్ శోభాయాత్ర

 

బెజ్జంకి, మే 9 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని హనుమాన్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్రను శనివారం ఘనంగానిర్వహించారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవమూర్తిని వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో కోలాట నృత్యాలు చేస్తూ శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
హనుమాన్ మాలదారులు, భక్తులు జై శ్రీరామ్, రామలక్ష్మన జానకి -జై బోలో హనుమానికి అని నినాదాలతో ర్యాలీ తీస్తూ, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ హనుమాన్ భక్తులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.