prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 5:42 am Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

గుగ్గిళ్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

బెజ్జంకి, ఏప్రిల్ 14(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామ పంచాయితీ ఆవరణలో ఘనంగా నిర్వహించి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అభివృద్ధి,సామాజిక చైతన్యం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుగ్యానీ లావణ్య -మోహన్, వార్డు సభ్యులు కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్, పోతూ భూలక్ష్మి,ర్యాకం అనిత, దూశెట్టి రాజిరెడ్డి, గుగ్గిళ్ల లావణ్య, పంచాయితీ కార్యదర్శి వంశీధర్,బోయిని ప్రశాంత్, అంబేద్కర్ సంఘం సభ్యులు,ఎంఆర్ పీఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.