గుగ్గిళ్ల గ్రామంలో ఘనంగా “మే డే”వేడుకలు

బెజ్జంకి,మే 1(ప్రజావాణి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో "మేడే" వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హమాలీ సంఘ అధ్యక్షులు ర్యాకం రాజు జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య,ఉపసర్పంచ్ దుగ్యని లావణ్య-మోహన్ మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకుని, చెమటను చిందిస్తూ, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.కార్మికుల శ్రమే దేశ అభివృద్ధికి పునాది అని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని,కార్మికుల కృషితోనే దేశం అభివృద్ధి దిశగా...