prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 12:03 pm Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్లలో ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు” కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు”

బెజ్జంకి, జూన్ 10 (ప్రజావాణి)

 

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పరవేణి బాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తిప్పరవేణి బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజల సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బోయిని ప్రశాంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.