గుండెపోటుతో తిరుపతి గౌడ్ మృతి: కొప్పుల ఈశ్వర్ పరామర్శ

ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన కోడేటీ తిరుపతి గౌడ్ ఆదివారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రామానికి చేరుకుని, మృతుడి పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. కొడుకు సతీష్ గౌడ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుపతి గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొని నివాళులర్పించారు.