prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 1:05 pm Digital Edition : RAJASHEKARREDDY

గుండారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల డైరీల ఆవిష్కరణ

బెజ్జంకి, ఆగస్టు 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం రూపొందించిన డైరీలను గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డైరీల వినియోగం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ హోంవర్క్‌ను డైరీలో నమోదు చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల చదువుపై అవగాహన పెంచుకుని వారి అభ్యాసంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. పాఠశాలలో బోధించే అంశాలు, హోంవర్క్ వివరాలు తల్లిదండ్రులకు చేరడం వల్ల విద్యార్థుల విద్యా నాణ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి, గ్రామ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యుడు ఎలుక శ్రీశైలం, ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, ప్రమోద్, శిరీష, హరీష్, తల్లిదండ్రులు కందిరాజు తదితరులు పాల్గొన్నారు.