గుండారం పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహణ
గుండారం పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహణ బెజ్జంకి, ఏప్రిల్ 8(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అతిథులుగా శ్రీరామ్ శ్రీనివాస్, నాగవేణి పాల్గొని చిన్నారులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం నాగవేణి మాట్లాడుతూ...