గుంటూరు నగర అభివృద్ధి పనులపై కమిషనర్ సమీక్ష ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3, శంకర్ విలాస్ ఆర్‌వోబీ, మిర్చియార్డ్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరానికి కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3,మిర్చియార్డ్ సమీప ఫ్లైఓవర్,శంకర్ విలాస్ ఆర్‌వోబీ నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రస్తుతం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు భవిష్యత్తులో నగరానికి తలమానికంగా నిలుస్తాయని పేర్కొన్నారు.పనులు నాణ్యతా ప్రమాణాలతో పాటు...