prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 11:32 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గుంటూరు నగరంలో ఘనంగా వేగా జువెలర్స్ షోరూమ్ ప్రారంభోత్సవం జరిగింది

గుంటూరు జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16)గుంటూరు ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు.ఆయనతో పాటు హీరోయిన్ డింపుల్ హయాతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. ఆయన రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది.షోరూమ్‌ను సందర్శించిన బాలకృష్ణ.అందుబాటులో ఉన్న ఆభరణాల డిజైన్లను పరిశీలించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.గుంటూరులో వేద జువెలర్స్ ప్రారంభం కావడం నగర ప్రజలకు మరిన్ని ఎంపికలను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బూర్ల రామాంజనేయులు, మరకశిరి ఎమ్మెల్యే రాజు,ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, అలాగే ఏపీ టీఎస్ మన్నవ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*