prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:21 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గుంటూరులో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు ముగ్గురికి జైలు శిక్ష – మరో వ్యక్తికి రూ.10 వేల జరిమానా

ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు జిల్లా  పోలీసులు ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్ పర్యవేక్షణలో గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ A.అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురు వాహనదారులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ ఒక టూ వీలర్ డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులకు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.జైలు శిక్ష విధించబడిన వారి వివరాలు• పామూరి శ్రీకాంత్ (29),చీమకుర్తి, ప్రకాశం జిల్లా– ఆటో డ్రైవర్• మేడికొండ నరేంద్ర (32),అంబేద్కర్ కాలనీ,చుండూరు మండలం  ఆటో డ్రైవర్•షేక్ బాషా (35),ఆదిత్య నగర్,గుంటూరు కార్ డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు ప్రజల భద్రత కోసం తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ఉల్లంఘనలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.