prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 6:18 am Digital Edition : PRAJA VANI

గిరిజనుల మహా ధర్నను విజయవంతం చేయండి

గిరిజనుల మహా ధర్నను విజయవంతం చేయండి. LHPS

బూర్గంపాడు/మండలం, ప్రజావాణి/మండల ప్రతినిధి మే24,.
ఈనెల 26వ తేదీన  లంబాడి హక్కుల పోరాట సమితి LHPS ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మంగీలాల్ నాయక్ అన్నారు. ప్రతి లంబాడి బిడ్డ స్వచ్ఛందంగా పాల్గొని 26న జరిగే చలో హైదరాబాద్  మహాధర్నను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఎస్ టి డిక్లరేషన్ గురించి ఈ సభలో ప్రధాన ప్రసంగం ఉంటుందన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని అమలుపరచాలన్నారు. అనంతరం చలో హైదరాబాద్ మహా ధర్నా కరపత్రాలను ఉప్పుసాక ఎస్టీ కాలనీ గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్ లాయర్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంగీలాల్ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ పినపాక నియోజకవర్గం అధ్యక్షులు భూక్యా ప్రసాద్ నాయక్, నాయకులు రాంబాబు నాయక్, సక్రు నాయక్, వల్య నాయక్, దరావత్ ఫుల్ సింగ్ నాయక్, బుక్యా దంజి నాయక్, బానోతు రాము నాయక్,కృష్ణ నాయక్ వెంకటేష్ నాయక్,నరేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు