గాలి, వాన బీభత్సం.. పెంకుటిల్లు కూలి వీఆర్ఏకు తీవ్ర గాయాలు..
తిరుమలాయపాలెం, ప్రజావాణి, జూన్ 19: తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామానికి చెందిన దంతాల వెంకన్న (వీఆర్ఏ) నివాసముంటున్న పెంకుటిల్లు గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది.ఇంటి లోపల నిద్రిస్తున్న వెంకన్నపై మట్టి గోడలు పడటంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, ఎడమ కాలు విరిగింది. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి వెంకన్నను కాకరవాయి గ్రామంలోని వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.అయితే మెరుగైన వైద్యం కోసం అవసరమైన ఆర్థిక...