గాలి దుమారంతో ఇల్లు కోల్పోయిన వృద్ధురాలికి అండగా మంత్రి ఉత్తమ్.

బాధితురాలికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు సూర్యాపేట, మే 28: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సంతో ఇల్లు కోల్పోయి నిలువనీడ లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అండగా నిలిచారు. గాలి దుమారానికి రేకుల ఇల్లు ఎగిరిపోవడంతో ఆశ్రయం కోల్పోయిన బాధితురాలికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను ఆదేశించారు. జిల్లాలోని మట్టంపల్లి మండలం పెద్దవీడు గ్రామానికి...