prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 6:44 am Digital Edition : RAJASHEKARREDDY

గాగిల్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

గాగిల్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

బెజ్జంకి, ఏప్రిల్ 30(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని సర్పంచ్ ఎర్రల జానకి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంటరానితనం నిర్మూలనతో పాటు సమాన హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ, హెడ్ పోలీస్ సిబ్బంది కిరణ్ కుమార్, జిపి కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, జిపిఓ శ్రీనివాస్, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ పాల్గొన్నారు. అలాగే సభ్యులు బండేపల్లి రమేష్, న్యాలం శారద, తడకపల్లి పవన్, కల్లేపల్లి లక్ష్మి, పైడిపల్లి శంకర్, మాజీ సర్పంచ్ మాసం శ్రీనివాస్ గ్రామస్తులు  తదితరులు హాజరయ్యారు.